కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో కోలా వీరబాబు అనే వ్యక్తి పసుపు కొమ్ములతో రూపొందించిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. 9 కిలోల పసుపు కొమ్ములు, 8 కిలోల తేనె మైనంతో పర్యావరణానికి హాని కలగకుండా ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు ఆయన బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాకు తెలిపారు. గతంలో రుద్రాక్షలు, వరి పిండితో కూడా వినాయకుడిని రూపొందించినట్లు, పండుగల పేరుతో పర్యావరణానికి హాని చేయవద్దని ఆయన సూచించారు. అలాగే టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యాలయంలోని కూడా వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు.