మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఆరోగ్య రంగంలో నైతిక ప్రమాణాలు, చట్టపరమైన పాలన కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్, డాక్టర్ పూజారి రమణ తెలిపారు. ప్రస్తుతం వైద్య రంగం అవకతవకలతో మాఫియాగా మారిందని విమర్శించారు. వైద్య వ్యవస్థకు గౌరవం తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.