సెప్టెంబర్ 15న విజయవాడలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కల్లూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.నరసింహులు కోరారు. శుక్రవారం కల్లూరు అర్బన్ పరిధిలోని షరీఫ్‌నగర్‌లో జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, రూ.4298 కోట్ల రూపాయల నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.