నందిగామ నియోజకవర్గం కంచికచర్ల సమీపంలోని కేసర వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 నెలల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో గాయపడిన చిన్నారి తల్లి శుక్రవారం రాత్రి విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తల్లి కూతురు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా ఈ ఘటనపై దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.