శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులోని వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 90 మంది లబ్ధిదారులకు గృహస్థలాలు క్వార్టర్స్ ను మంజూరు చేశారని అయితే కాలనీలో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల వంటి సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.