ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.