Download Now Banner

This browser does not support the video element.

ఎచ్చెర్ల: సంతబొమ్మాలి మండలం మాల నర్సిపురం గ్రామానికి చెందిన దళిత మహిళపై దాడికి పాల్పడ్డ ఆధిపత్య కులానికి చెందిన మహిళలు

Etcherla, Srikakulam | Jun 20, 2024
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మాల నర్సిపురం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళపై గురువారం ఉదయం 11 గంటలకు అదే గ్రామానికి చెందిన ఆధిపత్య కులం కి చెందిన మహిళలకు భూ వివాదం లో వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో దళిత మహిళ నడి వీధిలో నిల్చోని కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి అసభ్య పదజాలంతో తిట్టడంతో మహిళలందరూ ఏకమై దళిత మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దళిత మహిళ తలపై గాయమయ్యింది. గమనించిన స్థానికులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సంతబొమ్మాలి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us