జూలూరుపాడు లో బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బైకు ర్యాలీగా కొమరం భీం విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మరియు బిజెపి నాయకులు కలిసి ధర్నా నిర్వహించి అనంతరం స్థానిక సమస్యలపై తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్టు ద్వారా తక్షణమే కాలువలు ఏర్పాటు చేసి నీళ్ళు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసినారు