కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 1 లో ప్లాన్ రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు. మంచిర్యాల నుండి బల్లర్ష వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని రైలు శుక్రవారం ఉదయం ఢీకొట్టడంతో 60 నుండి 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతి చెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృతుడి చేతి పై పి గంగయ్య అని పచ్చబొట్టుతో రాసి ఉందని తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు,