ఎన్పీడీసీఎల్ ఏడిఈ మనోహర్ ను ఘనంగా సన్మానించిన అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలను నిబద్దతతో క్రమశిక్షణతో నిర్వర్తిస్తే, అటు ప్రజలు ఇటు అధికారుల్లో మంచి గుర్తింపు వస్తుందని, దురిశెట్టి మనోహర్ విద్యుత్ శాఖ ఏ డీఈ గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి టీజీ ఎన్పీడీసీఎల్ ఏడీఈ దురిశెట్టి మనోహర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జిల్లాలోని మెట్టుపల్లిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వివరించింది.