యోగాతో రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఎంపీడీవో ఫజుల్ రహిమాన్, ఎంఈవో సోమశేఖర్, నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ అన్నారు. మంగళవారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు యోగాపై అవగాహన కల్పించారు. యోగాతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.