పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ కి, పి నగాడి జంక్షన్ వద్ద సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన మతిస్థిమితం లేని ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అనే సమాచారం, మంగళవారం రాత్రి అందిన వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ స్వయంగా అక్కడికి వెళ్లి, తన సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని పెందుర్తి లోఇలా ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తీసుకెళ్లి సంరక్షణ నిమిత్తం అప్పగించారు. ఈ చర్యపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, పోలీసులపై ప్రశంసలు కురిపించారు.ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఇటువంటి మతిస్థిమితం లేని వ్యక్తులు ఎక్కడైనా కనిపించిన వెంటనే సమాచార ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు సతీష్ కుమార్