మల్కాపురం లో ఈస్ట్ ఇండియా పెట్రోలిమ్ కంపిణీ లో పెట్రోలిమ్ ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగు పడి మంటలు చెలరేగి సందర్బంగా వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాbలు తెలుకొన్న ప్రభుత్వ విప్ గణబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఏవో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యక్షంగా తానే వచ్చి పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సిబ్బందితో వచ్చారని పూర్తి విచారణ అనంతరం మంటలకు గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు.