శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని రైతు మిత్ర వద్ద సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. రైతులకు యూరియాను అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.