కల్లూరు అర్బన్ 32వ వార్డ్ గోవర్ధన్ నగర్ ప్రాంతంలో నిర్మించిన రైతు బజార్ ను ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం DYFI-ఐద్వా- CITU ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతుబజార్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా CITU నాయకులు సుధాకరప్ప,DYFI నగర కార్యదర్శి హుసేన్ బాషా,ఐద్వా స్థానిక కార్యదర్శి లక్ష్మి బాయ్ మాట్లాడుతూ 32వ వార్డ్ లో అనేక పోరాటాలు సాగించడం ద్వారా ప్రభుత్వాలు రైతుబజార్ ను మంజూరు చేయడం జరిగిందని అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అదిగో రైతు బజార్,ఇదిగో రైతు బజార్ అంటూ ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని వారు విమర్శించారు...