సఖినేటిపల్లి మండలంలోని ప్రధాన పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమీప పోలీస్ స్టేషన్లలో అదృశ్యం కేసులేమైనా నమోదయ్యాయా అని ఆరా తీస్తున్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.