కడప జిల్లా బద్వేల్ లో ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదన్నారు.విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయలేదన్నారు. విద్యుత్ శాఖపై రూ. 1.30 లక్షల కోట్ల భారాన్ని మోపిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు.రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమన్నారు.