గ్రీన్ గుంటూరు - క్లీన్ గుంటూరు సాధన కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. గురువారం ఉదయం నగర తూర్పు నియోజకవర్గం రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ లో స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి స్వచ్ఛతాహి సేవ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అక్టోబర్ 2 వరకు ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.