ఆస్పరి మండలంలోని బన్నూరు గ్రామం నుండి ఆధునికి వచ్చే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలేష్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్సు పాస్ కట్టిన, సరైన సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుతూ దూరమవుతున్నారన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలన్నారు.