ఐ.సి.డి.ఎస్. అధికారులతో గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. డిపార్ట్మెంట్ తరఫున అందిస్తున్న సేవలు, సిబ్బంది - ఖాళీలు, ఎంతమంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు, వాటిని నిర్వహిస్తున్న భవనాలు ( సొంత - అద్దె ), తదితర వివరాలపై కలెక్టర్ చర్చించారు. ఐసిడిఎస్ పిడి సువర్ణ ఆయా వివరాలను కలెక్టరుకు వివరించారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో 12 రకాల రిజిస్టర్లు ఉంటాయని, పిల్లల హాజరు, ఎత్తు, బరువు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం పంపిణీ, వాక్సినేషన్, సెక్టార్ మీటింగ్స్ నిర్వహణ వివరాలను ఆ రికార్డులలో నమోదు చేయాలి