ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలం, పెడబల్లి జెడ్పి ఉన్నత పాఠశాల టీచర్ వెంకటేశులు పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిలో 36 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తూ అందరి మన్ననలు అందుకున్నారన్నారు. ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు.