మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గుంటూరు అరండల్ పేట 1 వ లైనులో వరద నీటి ప్రవాహానికి కండోమ్స్ రోడ్లపైకి భారీగా కొట్టుకు వచ్చాయి. దీంతో బుధవారం సాయంత్రం వర్షపు నీటి ప్రవాహం తగ్గిన కొద్దిసేపటికి భారీగా కండోమ్స్ రోడ్లపై చేరడాన్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆ రోడ్డులో నడిచేందుకు కోడా ఇష్టపడని విధంగా రోడ్డుపై భారీగా కండోమ్స్ కనిపించాయి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డులో కండోమ్స్ కనబడడం పట్ల ప్రజలు చీదరించుకున్నారు.