Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 30, 2025
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో రెండు రోజులపాటు జరిగిన జాతీయ స్థాయి గిరిజన సంక్షేమ సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి పాల్గొన్నారు. శుక్ర,శని వారాల్లో జరిగిన జాతీయస్థాయి ఎస్టీ సంక్షేమ సమావేశంలో పాల్గొన్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి శనివారం మధ్యాహ్నం ఆమె మాట్లాడారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ.. గిరిజన సమాజానికి, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించడమే జాతీయ ఎస్టీ సంక్షేమ సంఘం ప్రధాన ధ్యేయం అని, ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు