రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు! శ్రీకాళహస్తిలోని పూసల వీధి వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. ఎవరి వద్ద నుంచి సేకరించారు అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం గుట్టు చప్పుడు కాకుండా ఆటోల ద్వారా బియ్యాన్ని సేకరిస్తుండటం పట్ల నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.