రోడ్డుకు మరమ్మతులు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్ డిమాండ్ చేశారు.మంగళవారం సాయంత్రం ఆసిఫాబాద్ నుంచి జానకాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి మురుగు. వర్షపు నీరు చేరి అధ్వానంగా తయారైందన్నారు. వాహనదారులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు చేసి. వాహనదారులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.