నగరానికి చెందిన ప్రతిభావంతురాలైన వైద్య విద్యార్థిని సృజనాదేవి 'మిస్ వైజాగ్' కిరీటాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన 'ఫర్ ఎవర్ మిస్ ఇండియా' పోటీల్లో ఆమె తన ప్రతిభతో ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని బీచ్‌రోడ్డులో ఉన్న నోవోటెల్ హోటల్‌లో ఆదివారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు ఈ కిరీటాన్ని బహూకరించారు.నిర్వాహకులు సృజనాదేవికి కిరీటం తొడిగి అభినందించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, సృజనాదేవి వైద్య విద్యను అభ్యసిస్తూనే ఫ్యాషన్ రంగంపై ఉన్న మక్కువతో ఈ విజయాన్ని సాధించడం ఎంతో అభినందనీయమన్నారు.