విజయనగరం జిల్లా విజయనగరం - కొత్తవలస రహదారికి అనుకొని ఉన్న కొత్త సుంకరపాలెం దత్తుడి బంద (చెరువు)లో గుర్తు తెలియని మృతదేహం మంగళవారం ఉదయం కలకలం సృష్టించింది. చెరువు బందలో తేలిన మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం కొత్తవలస పోలీసులకు సమాచారం అందించారు. జోరు వర్షం కారణంగా బందలోకి ఎవరూ దిగే సాహసం చేయటం లేదు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.