నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో యూరియా కొత్తతో రైతులు బుధవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం రైతులు బారులు తీశారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లలో వేచి ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతుందని తెలిపారు. ఈ పరిస్థితిని పరిష్కరించి యూరియా సరఫరా చేయాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.