గాజువాకలో ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ మీలాదున్నబీ పండుగ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు 1500 సంవత్సరాలు అయిన శుభ సందర్భంలో గాజువాక సున్ని జామా మసీదు నుండి శాంతియాత్ర బయలుదేరి అజిమాబాద్ వీధుల్లో తిరుగుతూ కనితి రోడ్డు మరియు గాజువాక మెయిన్ రోడ్ నుండి బీసీ రోడ్ చేరుకొని బీసీ రోడ్ల గల బాబా సయ్యద్ మదీనా దర్గా వద్ద ఫాతిహా ఆరాధన చేయడం జరిగినది అనంతరం బీసీ రోడ్లో ఈద్గా మైదానంలో జెండా ఎగరవేయడం జరిగింది . ఈ శాంతి యాత్ర సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ద్వారాగా జరిగింది.