గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం తన స్పందనను మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టులను ఏడాది వ్యవధిలోనే భర్తీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే అవగాహనతో కూడిన పాలన అందిస్తోందని, తమ నిబద్ధతను నిరూపించుకుందని ఆయన అన్నారు.