ఆలూరులో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి పయనమయ్యారు. రంగులు చల్లుకుంటూ డ్రమ్స్ వాయిద్యాలకు స్టెప్పులేస్తూ యువతీ యువకులు, మహిళలు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. హాలహర్వి, ఆలూరు మండలాలకు సంబంధించిన విగ్రహాలను హాలహర్వి మండలం బాపురం దిగువ కాల్వలో నిమజ్జనం చేస్తారు. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.