ఈనెల 6వ తేదీ శనివారం డబుల్ బెడ్ రూమ్ గృహాల ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ బి.యం.సంతోష్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.