ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా హనుమాన్ జంక్షన్ నుంచి ఖమ్మం కు మినీ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 8 గోవులను ఎస్సై లు p రామారావు, పవన్ కుమార్ లు పట్టుకున్నారు వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గోవులను స్వాధీనం చేసుకొని వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసారు పట్టుకున్న గోవులను టేకులపల్లి గోశాలకు పోలీసులు తరలించారు ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా గోవులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు స్థానికుల సమాచారం మేరకు గోవులు తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నరూ