మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం..' అనే నినాదంతో ప్రతిఒక్కరూ రాబోయే వినాయకచవతి వేడుకలు జరుపుకోవాలని పలువురు పర్యావరణ ప్రేమికులు పిలుపుమేరకు. అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందినా సామజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి దాదాపు 2500 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి గణపతులను పంపిణీ చేస్తూ స్టాల్ ఏర్పాటు చేశారు.