శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గొట్టిపల్లి గ్రామంలో శ్రీ ఉమా కామేశ్వరి స్వామి ఆలయం బుధవారం భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. ఆలయం తెరిచేందుకు వెళ్లిన అర్చకులు వాసనాభి హేమ సుందర్ గర్భగుడి నీటిలో మునిగిపోయి ఉండడాన్ని గమనించారు. భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికుల సహాయంతో బుధవారం ఉదయం మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడారని తెలిపారు.