పత్తికొండలో కురువ కులస్తులు డిఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఆలూరు మండలం మనేకుర్తిలో కురువ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పత్తికొండ డీఎస్పీ వెంకట్రారామయ్యను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, డైరెక్టర్ పి. శ్రీనివాసులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.