ఐదవ వార్డ్లో దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్ కు వినతి పత్రం అందజేశారు. వార్డు పరిధిలో గల మారికవలస జాతీయ రహదారి నుండి ఐటీ సెజ్ కు వెళ్ళే రోడ్లో రాత్రి పూట చీకటి గా ఉండడం వలన త్రాగుబోతులు,మత్తు పదార్థాలు సేవించే వారు ఆరోడ్డులో ప్రయాణించే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. ఆ రోడ్డులో త్వరితగతిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మరియు వార్డు పరిధిలో గల ప్రధాన కూడలిలో 10రింగ్ పోల్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనిఅన్నారు.