శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకరనాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట పట్టణంలో భాగంగా మాట్లాడుతూ ఆగస్టు 19 రాత్రి శ్రీశైలం శిఖరం నల్లమల్ల అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఫారెస్టు సిబ్బందిపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అడవి శాఖ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని శంకర్ నాయక్ కోరారు.