విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్పూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర. వెంకటరమణ పిలుపునిచ్చారు. గురువారం విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం సందర్భంగా శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించాలన్నారు.