శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో కాశీబుగ్గ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా... అనుమనాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా.. 16 కేజీల గంజాయి పట్టుబడినట్లు గురువారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ సూర్యనారాయణ తెలిపారు. ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళను రిమాండ్ కి తరలించి వారి వద్ద రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.