3వ డివిజన్ ఎగువపేట శ్రీ నూకాలమ్మ గుడి స్టేజ్ వద్ద వినాయక నవరాత్రులు సందర్బంగా ఏర్పాటు చేసిన బాహుబలి సెట్ ను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గురువారం సాయంత్రం సందర్శించి నిర్వాహకులను అభినందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆహ్వానం మేరకు విచ్చేసిన శ్రీభరత్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిద్ది వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సాధర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బాహుబలి సెట్ లాంటి అద్భుత కళాఖండాన్ని ఎంతో శ్రమకోర్చి చేశారని, ఇంత నైపుణ్యంతో ఎన్నో రోజులు కష్టపడి పనిచెసిన కారి శ్రీధర్ మరియు రుద్ర బాయ్స్ కి నాయొక్క అభినందనలు తెలిపారు.