చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేకంగా సాగుతున్నదని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అన్నారు. గుంతకల్లు లోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం రైతు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని సరిగా నెరవేర్చలేదన్నారు. రైతులను తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైసీపీ రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. రైతు పోరు కార్యక్రమంతో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.