ఆస్పరి మండలం కైరుప్పల గ్రామ శాఖ ఆధ్వర్యంలో కైరుప్పల గ్రామంలో డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 6 మంది నూతన ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని సన్మానించడం జరిగిందని, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఆదివారం తెలిపారు. గ్రామంలోని ఓ ఆలయంలో సన్మాన సభ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.