గోడ కూలి వృద్దులకు గాయాలు వర్షానికి నానిని ఇంటి ప్రవారీ గోడ కూలడంతో ఇద్దరు వృద్దులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కెలూర్ గ్రామంలో గురువారం జరిగింది. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ ముజీబ్ ఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణి బాయి దంపతులను పరామర్శించారు.