వినాయక నిమజ్జన శోభాయాత్రను తాడిపత్రిలోని గాంధీ సర్కిల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గాంధీ కట్ట వినాయక విగ్రహం వద్ద వారు ప్రత్యేక పూజలు చేసి, శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. వందలాది విగ్రహాలు శోభాయాత్రలో దర్శనమిచ్చాయి. వేలాది మంది ప్రజలు కులమతాలకు అతీతంగా శోభాయాత్రను తిలకిస్తున్నారు.