ఒక్కసారి పోక్సో కేసు నమోదైతే కేసు బలంగా ఉంటుందని, తప్పు చేయలేదని ముద్దాయే నిరూపించుకోవాల్సి ఉంటుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావ్ తెలిపారు. శనివారం కోర్టులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోక్సో కోసం స్పెషల్ కోర్టులు ఉంటాయని, ఏడాదిలోపే శిక్ష పడుతుందని తెలిపారు. ఈ కేసులు ఎక్కువ బంధువుల్లోనే జరుగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలన్నారు.