మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు మంగళవారం కాకినాడలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆజా మాట్లాడుతూ వైయస్సార్ ప్రభంజనం అని ఆయన నవ్వులో స్వచ్ఛత పిలుపులు ఆత్మీయత ఉంటుందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.