అద్దంకిలోని ఆర్టీసీ కాలనీ నందు నివాసం ఉంటున్న కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి భార్య ఉషారాణి శనివారం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్పందించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి రెడ్డి మేదరమెట్ల పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.