మచిలీపట్నం లో రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని వైసిపి నాయకులు మచిలీపట్నంలో ఆర్డీఓ స్వాతిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ రైతన్నకు అండగా యూరియాతో పాటు ఇతర ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టి, ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.