తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలం లో ఎంపిక చేసిన ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులను తాళ్ళరేవు లయన్స్ క్లబ్ హాల్ లో ఘనంగా సత్కరించి మెమోంటో లు అందజేశారు, ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పొన్నాడ పేరయ్య రాజు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ను ఆదర్శంగా తీసుకుని పని చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.